వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నేటితో సచిన్ "క్రికెట్ పాత్ర"కు రెండు దశాబ్దాలు పూర్తి! (Sachin | 20 Years | Pakistan | India | Cricket | 16 years | Rajsingh Dungarpure)
Feedback Print Bookmark and Share
 
File
FILE
అది.. 1989 నవంబరు ఐదో తేదీ. పాకిస్థాన్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఆ నాడు జట్టు కెప్టెన్‌గా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్, చీఫ్ సెలక్టర్‌గా రాజ్‌సింగ్ దుంగార్పూర్‌లు ఉన్నారు. జట్టు ఎంపికపై తీవ్రస్థాయిలోనే కసరత్తు జరిగింది.

పాక్ పర్యటన కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. అందులో ఓ 16 సంవత్సరాల కుర్రాడికి తొలిసారి చోటు కల్పించారు సెలక్టర్లు. ఆ కుర్రాడే.. రెండు దశాబ్దాలుగా క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్నాడు. అతనే సచిన్ రమేశ్ టెండూల్కర్.

భారత క్రికెట్‌కు వన్నెతెచ్చిన ఆ క్రికెట్ హీరో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి నేటికి 20 సంవత్సరాలు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. విమర్శలు వచ్చినా.. చలించని దృఢ చిత్తంతో తన పని తాను చేసుకుని పోతున్నాడు.

యాదృచ్ఛికమో ఏమో గానీ.. క్రికెట్ అరంగేట్రం చేసిన ఇదే రోజున సచిన్ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ మరో అరుదైన రికార్డుకు వేదిక కానుంది. వన్డేల్లో 17 వేల పరుగుల మైలురాయికి సచిన్ మరో ఏడు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇది పూర్తి చేస్తే.. తన 20వ క్రికెట్ వసంతానికి కానుకగా తనకు తానుగా సమర్పించుకునే అరుదైన బహుమతిగా నిలిచి పోనుంది. ఆల్ ది బెస్ట్ మాస్టర్ బ్లాస్టర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.