ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఐపీఎల్- త్రీ: ఆటగాళ్లకు అనుమతిచ్చిన పాక్ బోర్డు (IPL III | Pakistan Cricket Board | players | allow | Lallit Modi)
ఎట్టకేలకు.. ఐపీఎల్ త్రీ ద్వారా వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు తిరిగి రంగప్రవేశం చేయనున్నారు. కాసుల వర్షం కురిపించే.. ఐపీఎల్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వడంతో పాక్ ఆటగాళ్లు రానున్న ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులోకి రానున్నారు.
ఓ సమావేశంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన సందర్భంగా ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీతో ఈ విషయాన్ని స్వయంగా.. పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్ చెప్పారు. ఈ విషయాన్నే విలేకరుల సమావేశంలో భట్ తెలిపారు. గతంలో ముంబైలోని తాజ్ హోటల్‌పై ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో.. ఐపీఎల్ టూలో ఆడేందుకు పాక్ ఆటగాళ్లకు పీసీబీ అనుమతి ఇవ్వలేదు.
అయితే భద్రతా కారణాలతో.. ఐపీఎల్ టూను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఇదే సమయంలో.. పాక్ ఆటగాళ్లతో కాంట్రాక్టులను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రద్దు చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు తాజాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ జాబితాలో.. లేదా బిడ్‌లో పాక్ ఆటగాళ్లను కూడా చేర్చాల్సిందిగా మోడిని కోరినట్లు భట్ వెల్లడించారు. వచ్చే ఏడాదిలో జరిగే ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపాడు.