ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్ వన్డే: శుభారంభం చేసిన ఆసీస్ ఓపెనర్లు (Hyd | ODI | Australia | Openers | Watsan | Century | Bhajji | Wicket)
అనుకున్నట్టుగానే తమకు అచ్చివచ్చిన ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు భారత బౌలర్లపై విరుచుక పడ్డారు. స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఫలితంగా ఆ జట్టు 25 ఓవర్లలో 145 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ వాట్సన్ రెచ్చిపోయి వీరవిహారం చేశాడు. అయితే మరో ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 89 బంతుల్లో మూడు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లతో రెచ్చిపోయిన వాట్సన్ (93) హర్భజన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయత్నించాడు.
వాట్సన్ కొట్టిన బంతి గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ జడేజా అద్భుతంగా క్యాచ్‌ను పట్టుకున్నాడు. దీంతో వాట్సన్ ఇన్నింగ్స్ తెరపడింది. అప్పటికే ఆస్ట్రేలియాకు మంచి పునాది ఏర్పడింది. మరో ఓపెనర్ మార్ష్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. వాట్సన్ పెవిలియన్‌కు చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రికీపాంటింగ్ ఆచితూచి ఆడుతూ భారీ స్కోరు దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు.