వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోచ్‌గా వాట్‌మోర్! (KKR | Sharuk Khan | Australia | Ganguly | IPL-3 | Coach)
Feedback Print Bookmark and Share
 
బాలీవుట్ స్టార్ షారూక్ ఖాన్‌కు సొంతమైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా జట్టు మాజీ కోచ్ వాట్‌మోర్ నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు సభ్యుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో కేకేఆర్‌ జట్టుకు గంగూలీ సారథ్యం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. తమ జట్టు కొత్త కోచ్‌గా వాట్‌మోర్‌ ఉంటారని చెప్పారు. ఆతయ తనకు చాలా కాలంగా తెలుసు. ఆయనతో కలసి పని చేయడం గొప్పగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

అంతేకాకుండా, వాట్‌మోర్ ఎంతో క్రికెట్ అనుభవం ఉన్న కోచ్‌. ఆయనతో కలసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను అని గంగూలీ తెలిపాడు. వాట్‌మోర్‌ కోచ్‌గా ఉన్నప్పుడే శ్రీలంక 1996లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్నది. ఆ తరువాత వాట్‌మోర్‌ బంగ్లాదేశ్‌ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.