వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » 12 యేళ్ళ కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు! (Cricket | Sarparaj Khan | Mumbai | Sachi | Record | Nagdev | Score)
Feedback Print Bookmark and Share
 
భారత క్రికెట్‌లో మరో సచిన్ టెండూల్కర్ పుట్టుకొచ్చాడా? అవుననే సమాధానం లభిస్తోంది ప్రస్తుతం. మేటి సచిన్ 21 సంవత్సరాల క్రితం చేసిన రికార్డును ఆదర్శంగా తీసుకున్న 12 యేళ్ళ బుడతడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతని పేరు సర్ఫరాజ్ ఖాన్. ముంబై హారీస్ షీల్డ్ అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ ఖాన్ వీరవిహారం చేసిన ఏకంగా 439 పరుగుల రికార్డును నెలకొల్పాడు.

ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (కాండివిలి)తో మ్యాచ్‌లో రిజ్వి స్ప్రింగ్‌ఫీల్డ్‌ తరపున సర్ఫరాజ్‌ ఈ కొత్త రికార్డు స్థాపించాడు. 1963-64లో అవుట్ కాకుండా 427 పరుగుల స్కోరుతో ఆర్‌.నాగదేవ్‌ పేరిట ఉన్న రికార్డును సర్ఫరాజ్ చెరిపేసి, తన పేరుమీద లిఖించుకున్నాడు.

మొత్తం 421 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 439 పరుగులు చేశాడు. అతని స్కోరులో 56 బౌండరీలు, 12 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌కు తన వ్యక్తిగత స్కోర్లు 25, 253, 302 వద్ద లైఫ్‌లు లభించాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఖాన్ మరో సచిన్‌ను తలపిస్తూ రికార్డులపై రికార్డులు సృష్టించాడు.

ఈ రికార్డు నెలకొల్పడానికి ఒకరు ఆదర్శం కావడం గమనార్హం. అతనే.. భారత క్రికెట్‌ను శాసిస్తున్న మాస్టర్ బ్లాస్టర్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. 21 సంవత్సరాల క్రితం ఇదే టోర్నమెంట్‌లో సచిన్ టెండూల్కర్‌ 346 పరుగుల స్కోరును అధిగమించడాన్ని అతను ఈ మ్యాచ్‌లో తన తొలి లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

ఈ రికార్డుపై సర్ఫరాజ్ స్పందిస్తూ.. సచిన్‌ స్కోరును దాటేందుకు కృషి చేయాలని మా నాన్నగారు నన్ను కోరుతూ ఉండేవారు అని చెప్పారు. 'నేను ఇప్పటికే 235 స్కోరుతో ఉన్నాను. క్రాస్‌ మైదాన్‌లో బౌండరీలలో ఒకటి తక్కువ నిడివితో ఉన్నందున ఈ లక్ష్యాన్ని సాధించవచ్చునని నేను భావించాను అని చెప్పాడు. కాగా, సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ స్థాని కోచ్ కావడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.