వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అరుదైన గౌరవంగా భావిస్తున్నా: మాస్టర్ బ్లాస్టర్! (Representing | India | absolute | honour | Tendulkar | Cricket Arena | Hyd)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో దేశం తరపున 20 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ అరంగేట్రం చేసి 20 యేళ్లు పూర్తి చేసిన రోజునే 17 వేల పరుగుల మైలురాయిని సచిన్ చేరుకున్నాడు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. అన్ని సమయాల్లో తన దృఢ చిత్తం కోల్పోకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశం తరపున ఆడటం ఎల్లపుడూ ఒక గౌరవంగానే భావిస్తాను. 20 సంవత్సరాల పాటు కొనసాగడం అరుదైన గౌరవంగానే భావిస్తాను అని చెప్పారు.

అయితే, గురువారం హైదరాబాద్‌లో జరిగిన కీలకమైన ఐదో వన్డేలో భారత్ ఓడిపోవడం పట్ల సచిన్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మేం బాగానే ప్రారంభించాం. సురేష్ రైనా తాను కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. అయితే, కీలక సమయంలో ప్రధాన వికెట్లను కోల్పోయాం. మ్యాచ్ ఫలితం నిరాశకు లోను చేసిందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.