ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మాస్టర్ బ్లాస్టర్.. 17 వేల పరుగులు చేసిందిలా...! (Sachin | Score | Matches | Runs | Milestone | Jayasurya | Ricky Ponting)
అంతర్జాతీయ క్రికెట్ వన్డే చరిత్రలో 17 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రికార్డు కోసం చేసిన పరుగుల్లో ఎక్కువగా ఆస్ట్రేలియాపైనే చేసినవి కావడం గమనార్హం. ఆస్ట్రేలియాపై 66 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 2995 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపై 74 మ్యాచ్‌లలో 2749 పరుగులు, పాకిస్థాన్‌తో 67 మ్యాచ్‌లు ఆడి 2389 పరుగులు చేశాడు.
కాగా తన 17 వేల పరుగుల మైలురాయిలో 45 సెంచరీలు ఉన్నాయి. 44 సగటుతో మొత్తం 17168 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య 13377 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 12241 పరుగులతో తృతీయ స్థానంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సచిన్ వివిధ దేశాలపై చేసిన పరుగులను ఒకసారి పరిశీలిద్ధాం. ఆస్ట్రేలియాపై 2995 (66 మ్యాచ్‌లు), ఇంగ్లండ్‌పై 1335 (36), న్యూజిలాండ్‌పై 1750 (42), పాకిస్థాన్‌పై 2389 (67), దక్షిణాఫ్రికాపై 1655 (52), శ్రీలంకపై 2749 (74), వెస్టిండీస్‌పై 1571 (38), జింబాబ్వేపై 1377 (34), బంగ్లాదేశ్‌పై 354 (10), బెర్ముడాపై 57 (1), ఐర్లాండ్‌పై 4 (1), కెన్యాపై 647 (10), నెదర్లాండ్‌పై 52 (1), నమీబియాపై 152 (1), యూఏఈపై 81 (2) పరుగులు చొప్పున చేశాడు.