వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » యువ క్రికెటర్లకు సచిన్ కెరీర్ ఓ పాఠం: మియాందాద్ (Tendulkar's | career | lesson | all youngsters | Miandad | Pakistan)
Feedback Print Bookmark and Share
 
క్రికెట్‌లో రాణించాలనే ఉవ్విళ్లూరే యువ క్రికెటర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ ఒక పాఠంలాంటిదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ అన్నారు. సచిన్ తాజాగా సాధించిన 17 వేల పరుగుల మైలురాయిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మియాందాద్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా అలసట లేకుండా క్రికెట్ కెరీర్‌ను సాగిస్తున్న టెండూల్కర్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు.

పరుగుల వరద పారించడంలో తనకు తానే సాటి అని మరోమారు నిరూపించుకున్నాడు. భారత్, పాకిస్థాన్‌లోనే కాకుండా ఆసియా ఉపఖండంలో క్రికెట్‌లో రాణించాలనే యువ క్రికెటర్లకు సచిన్ కెరీర్ ఒక పాఠంలాంటిదన్నారు. క్రికెట్‌లో రాణించాలనుకునే వారు సచిన్‌ను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. ఆరంభంలో ఏ విధంగా పరుగులు చేశాడో అదే విధంగా సచిన్ తన 20 యేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలోనూ చేస్తున్నాడన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.