ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ (Sourav Ganguly | Returns | KKR captain | Whatmore | Coach | Jay Mehata)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని జట్లలో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా 'టీమ్ ఇండియా' మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యాడు. అలాగే, ఆ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా జట్టు మాజీ కోచ్ వాట్‌మోర్‌ను నియమిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్-2లో కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్ వ్యవహించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్‌గా తిరిగి సౌరవ్ గంగూలీని నియమితులయ్యాడు.
దీనిపై కేకేఆర్ కో ఓనర్ జే మెహతా మాట్లాడుతూ.. జట్టు కోచ్‌గా వాట్‌మోర్ సరైన వ్యక్తి. కేవలం జట్టుకు మాత్రమే కాకుండా ప్రతి ఆటగాడికి సరైన దిశానిర్ధేశం చేయగల సామర్థ్యం ఉందన్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు స్థానమేమిటో అతనికి బాగా తెలుసని అన్నారు.