వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » గౌహతికి చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా జట్లు (Gowhati | India | Australia | Security Force | Nehru Stadium | Cricket)
Feedback Print Bookmark and Share
 
ఏడు మ్యాచ్‌ల హీరో హోండా సిరీస్‌లో భాగంగా ఆరో వన్డే కోసం భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు అస్సో రాష్ట్ర రాజధాని గౌహతికి చేరుకున్నాయి. ఈ జట్ల ఆటగాళ్లు బస చేసిన హోటల్‌తో పాటు.. స్టేడియం వద్ద కనివినీ ఎరుగని రీతిలో భద్రతా బలగాలను మొహరించారు. ఒక విధంగా చెప్పాలంటే గౌహతి మొత్తం భద్రతా బలగాల రక్షణ వలయంలో ఉంది. స్థానిక పోలీసులతో పాటు.. పారా మిలిటరీ, ప్రత్యేక దళాలను కూడా భద్రతలో వినియోగించడం గమనార్హం.

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం పొంచివున్నందున మ్యాచ్ జరిగే నెహ్రూ స్టేడియం వద్ద మూడు అంచల భద్రతను కల్పించినట్టు సీనియర్ ఎస్పీ ప్రదీప్ చంద్ర సలోయ్ తెలిపారు. ఎక్కడా కూడా ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఉండేలా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో గౌహతిలో ఉగ్రవాదుల దాడులు ఎక్కువ అవుతున్న విషయం తెల్సిందే. వీటికి తోడు వేర్పాటువాద శక్తులు కూడా అపుడపుడూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను అసాధారణ రీతిలో కల్పించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.