వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భారత్-లంక సిరీస్: స్పాన్సర్ అన్వేషణలో బీసీసీఐ! (India | Sri Lanka | Sponcer | BCCI | ODI | Tests | T-20 | Match)
Feedback Print Bookmark and Share
 
భారత్-శ్రీలంక పర్యటన కోసం సరైన స్పాన్సర్‌ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అన్వేషణ సాగిస్తోంది. ఇరు జట్ల జరుగనున్న సిరీస్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే, స్పాన్సర్ ఎవరనేది ఇప్పటి వరకు తేలలేదు. దీంతో బీసీసీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఐదు వన్డేలు, రెండు ట్వంటీ-20, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెల్సిందే. వన్డేలు, ట్వంటీ-20లకు స్పాన్సర్ ఇబ్బందులు తలెత్తక పోయినప్పటికీ.. టెస్టులకు మాత్రం సమస్య నెలకొంది. స్పాన్సర్‌ను సాధించేందుకు బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. దీని ప్రభావం టెస్ట్‌ సిరీస్‌ టిక్కెట్ల ముద్రణపై స్పష్టంగా కనబడుతోంది.

కాన్పూర్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ టిక్కెట్లను స్పాన్సర్‌ పేరు లేకుండానే ముద్రించాలని ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం నిర్ణయానికి వచ్చింది. దీనికి బీసీసీఐ పెద్దలు కూడా సమ్మతించారు. అలాగే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే గుజరాత్‌ క్రికెట్‌ సంఘం ఇదేవిధంగా టిక్కెట్లను ముద్రించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.