గెలుపు ముంగిటకు వచ్చి ఒక చెత్తషాట్‌కు అవుటైనందుకు పరుగుల యంత్రం సచిన్ టెండూల్కర్ గుండె పగిలి ఉంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో నాలుగు వికెట్లు ఉన్న సమయంలో సచిన్ అవుట్ అయినందుకు జీవితకాలం బాధపడుతూనే ఉంటాడని గంగూలీ అన్నాడు.
హైదరాబాద్‌లో ఆవిష్కృతమైన సచిన్ ఇన్నింగ్స్‌పై గంగూలీ స్పందిస్తూ... భారీ విజయలక్ష్యాన్ని చేధించే మ్యాచ్‌ను విజయం వరకు తీసుకెళ్లిన ఘనత సచిన్‌కే దక్కుతుందన్నారు. ఇకపోతే.. సచిన్‌కు "కింగ్ ఆఫ్ క్రికెట్"గా దాదా అభివర్ణించాడు. అతను ఓ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారని గుర్తు చేశారు.
సచిన్ కెరీర్‌లో 45 సెంచరీలు, 17 వేల పైచిలుకు పరుగులు.. ఇందుకోసం సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌లలో అత్యత్తమ ఇన్నింగ్స్ కోసం వెదికినా హైదరాబాద్ ఇన్నింగ్సే కళ్ళ ముందుకు వస్తుందని చెప్పాడు. సచిన్ ఆడిన ఎన్నో ఇన్నింగ్స్‌లను కళ్ళతో ప్రత్యక్షంగా చూశా. అయితే, ఇవేవీ హైదరాబాద్ ఇన్నింగ్స్‌తో సరిపోవని గంగూలీ అభిప్రాయపడ్డారు.