వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్‌లో గెలిచుంటే బాగుండేది: సచిన్ (Sachin Tendulkar| Cricket| Hyderabad| Australia| Team India| Fifth One day)
Feedback Print Bookmark and Share
 
Sachin
FILE
గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో గెలుపొంది ఉంటే చాలా సంతోషించేవాడినని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో 175 పరుగులు చేసి 17000 పరుగుల రికార్డు మైలురాయిని దాటిన సచిన్.. హైదరాబాద్ ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

45వ సెంచరీతో భారత్‌ను విజయం అంచుల దాకా సచిన్ తీసుకెళ్లినప్పటికీ లోయర్ ఆర్డర్ వైఫల్యంతో మూడు పరుగుల తేడాతో టీం ఇండియా ఓటమిని చవిచూసింది.

దీనిపై సచిన్ మాట్లాడుతూ.. భారత్ తరపున గట్టిపోటీని ప్రదర్శించాలన్నది తన కల అని, అది తనకు లభించిన గౌరవంగా భావిస్తానని చెప్పాడు. అందుకే తాను ఎన్ని సంవత్సరాలైనా భారత్ తరపునే ఆడాలని కోరుకుంటానని తెలిపాడు.

ఐదో వన్డేలో తాము శుభారంభం చేశామని, ఒక సమయంలో తాను, రైనా మంచి భాగస్వామ్యం నిర్మించినా ఫలితం లేకపోయింది. కానీ కొన్ని కీలక వికెట్లు కోల్పోవడంతో, చివరకు ఆట ముగిసేసరికి నిరాశే ఎదురైందని సచిన్ అన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.