ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మిగిలిన రెండు వన్డేలపై కన్నేసిన టీమ్ ఇండియా! (India | Eye victory | Series | Guwahati | Australia | Do or Die | Mumbai | Dhoni)
ఏడు వన్డేల హీరో హోండా కప్‌లో భాగంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు భారత్‌కు అత్యంత కీలకం కానున్నాయి. స్వదేశంలో ప్రపంచ జగజ్జేత ఆస్ట్రేలియాతో జరుగున్న వన్డే సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే ధోనీ సేన మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పకుండా విజయం సాధించి తీరాల్సిన నిర్భంద పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు జరిగిన ఐదు వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టు 3-2 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఆదివారం గౌహతిలో జరిగే ఆరో వన్డేతో పాటు.. ఆపై ముంబైలో జరిగే చివరి వన్డేలో భారత జట్టు తప్పకుండా విజయం సాధించాల్సి వుంది. ఈ రెండు వరుస విజయాలు సాధిస్తే వన్డే సిరీస్ భారత్ వశం అవుతుంది. లేదంటే కంగారులు ఎగురేసుకుని పోవడం ఖాయం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. భారత జట్టు విజయం ముంగిట బోల్తా పడుతోంది. పైపెచ్చు ఆస్ట్రేలియా జట్టు మాత్రం సమిష్టి కృషితో విజయాలు సాధిస్తోంది. అయితే, తొలి వన్డేలో ఆసీస్ పైచేయి సాధించినప్పటికీ.. ఆ తర్వాత రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించింది.
నాలుగు, ఐదు మ్యాచ్‌లోల ఆస్ట్రేలియా గెలుపొంది సిరీస్ ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. దీంతో భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ధోనీ సేన మిగిలిన రెండు మ్యాచ్‌లలో సమిష్టిగా రాణిస్తేనే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.