వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అహ్మదాబాద్ టెస్టు: అర్థ సెంచరీతో ఆదుకున్న ద్రావిడ్ (First Test | Half Century | Dravid | UV | Wickets | Sri Lanka | India)
Feedback Print Bookmark and Share
 
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. ఫలితంగా భారత జట్టు లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులతో ఉంది. మరో ఎండ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్.. ద్రావిడ్‌కు అండగా ఉన్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శ్రీలంక బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. కేవలం 32 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను నేలకూల్చారు. మొదటి డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ద్రావిడ్, యువరాజ్ సింగ్‌లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నింపాదిగా ఆడుతూ జట్టు స్కోరును పెంచారు.

దీంతో తొలి రోజు లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లంచ్ తర్వాత ద్రావిడ్ ఒక బౌండరీ కొట్టి టెస్టు కెరీర్‌లో 58వ అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకపై ఇది ద్రావిడ్‌కు తొమ్మిదో అర్థ సెంచరీ. యువరాజ్ సింగ్ 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.