ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ట్వంటీ-20 మ్యాచ్: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి (T-20 | England | South Africa | Overs | Runs | Victory | Bosemen | Smith)
ట్వంటీ-20 మ్యాచ్: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి
సోమవారం, 16 నవంబర్ 2009( 14:27 IST )
సొంత గడ్డపై పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు విజభేరీ మోగించింది. ఆ జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 44 బంతుల్లో 88 పరుగులు చేయగా, మరో ఓపెనర్ బోస్‌మెన్ 45 బంతుల్లో 94 పరుగుల వీరవిహారంతో సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 241 పరుగులు చేసింది.
ఆ తర్వాత 242 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 157 పరుగులకే చేయగలిగింది. దీంతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 టోర్నీలో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి.
దక్షిణాఫ్రికాలోని వాండర్సన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ట్వంటీ-20 చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా రికార్డు పుటలకెక్కింది. గతంలో కెన్యాపై శ్రీలంక జట్టు 260 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది.
సఫారీల ఇన్నింగ్స్‌లో మొత్తం 19 బౌండరీలు, 17 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇది ట్వంటీ-20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా ఓపెనర్ బోస్‌మెన్ 9 సిక్స్‌లు, ఐదు బౌండరీలు బాదగా, గ్రేమ్ స్మిత్ ఎనిమిది బౌండరీలు, ఆరు సిక్సర్లు కొట్టాడు.
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అడిల్ రషీద్ ఒకే ఓవర్‌లో 25 పరుగులను సమర్పించుకున్నాడు. రషీద్ ఓవర్‌లో స్మిత్ ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.