వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వెస్టిండీస్‌తో తొలిటెస్టు: బ్రెట్ లీ ఎంపిక సందేహమే! (Sydney | Australia | Fast bowler | Brett Lee | First Test | West Indies)
Feedback Print Bookmark and Share
 
సొంత గడ్డపై ఈనెల 26వ తేదీ నుంచి జరుగనున్న తొలి టెస్టుకు ఫాస్ట్ బౌలర్ల బ్రెట్ లీ ఎంపిక సందేహంగా మారింది. ఎల్బో గాయం నుంచి బ్రెట్ లీ ఇంకా కోలుకోలేదు. దీంతో లీని తొలి టెస్టుకు ఎంపిక చేసే విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఈ గాయం వల్ల మంగళవారం నుంచి టాస్మానియా జట్టుతో జరిగే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌కు కూడా లీ దూరమయ్యాడు. ఎల్బో గాయంతో బాధపడుతున్న బ్రెట్ లీని ఈ మ్యాచ్‌కు పరిగణంలోకి తీసుకోలేదు. గాయానికి మెరుగైన వైద్య సేవలు చేయించుకోవాల్సిందిగా సూచన చేసినట్టు న్యూ సౌత్ వేల్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ టెస్టు బ్రిస్బేన్ స్టేడియంలో జరుగనుంది.

గత యేడాది జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే లీ ఆడాడు. ఆ తర్వాత తొడ కండరాల గాయంతో స్వదేశంలో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌తో పాటు ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇటీవల భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఒకే ఒక మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న బ్రెట్ లీ ఆ తర్వాత గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.