వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అహ్మాదాబాద్ టెస్టు: సెంచరీతో కదం తొక్కిన దిల్షాన్ (Dilshan | Ahmedabad | Test | Century | Dravid | Sri Lanka | Openers)
Feedback Print Bookmark and Share
 
భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు ఓపెనర్లు తొలి టెస్టులో శుభారంభం చేశారు. ఓపెనర్ దిల్షాన్ (112) సెంచరీతో కదం తొక్కగా, మరో ఓపెనర్ పరణవితన 35 పరుగులతో రాణించాడు. ఫలితంగా తొలి టెస్టులో రెండో రోజు మధ్యాహ్నం డ్రింక్స్ సమయానికి శ్రీలంక జట్టు రెండు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ సంగక్కర (31), జయవర్ధనే (3)లు ఉన్నారు.

అంతకుముందు తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనింగ్ భాగస్వామ్యంగా 74 పరుగులు జోడించిన తర్వాత పరణవితన (35) ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ కెప్టెన్ సంగక్కరతో కలిసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 133 బంతులను ఎదుర్కొన్న దిల్షాన్ 112 పరుగులు చేసిన తర్వాత జహీర్ బౌలింగ్‌లో ద్రావిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సంగక్కర, జవర్ధనేలు నింపాదిగా ఆడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.