వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అహ్మదాబాద్ టెస్టు: ధీటుగా స్పందించిన శ్రీలంక (Ahmedabad | Test | Sri Lanka | Dilshan | Sangakkara | Jayawardane)
Feedback Print Bookmark and Share
 
అహ్మదాబాద్‌లో భారత్‌లో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక శ్రీలంక జట్టు ధీటుగా స్పందించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు సమయోచితంగా రాణించారు. ఫలితంగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

భారత్ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు మరో 151 పరుగులు వెనుకబడి వుంది. కాగా, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్ దిల్షాన్ (112) పరుగులతో రాణించగా, పరణవితన (35), సంగక్కర (31), జయవర్ధనే (36), సమరవీర (45)లు తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా భారత్ స్కోరుకు లంక జట్టు ధీటుగానే స్పందించారు.

అంతకుముందు శ్రీలంక ఓపెనర్లు వన్డే తరహాలో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఫలితంగా ఆ జట్టు తొలి 16 ఓవర్లలోనే 74 పరుగులు చేసింది. అయితే, మరో ఓపెనర్ పరణవితనను ఇషాంత్ శర్మ ఔట్ చేసి వీరిద్దరి భాగస్యామ్యానికి చెక్ పెట్టాడు. దిల్షాన్ మాత్రం సెంచరీతో జట్టును ఆకట్టుకున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.