ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భుజం గాయంతో తుషార టెస్టు సిరీస్‌కు దూరం! (Shoulder injury | Tushara | Sri Lanka | Test Series | Fernando | India)
భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుకు తొలిదెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసల్ థిలాన్ తుషార భుజం గాయం కారణంగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో దిల్హారో ఫెర్నాండోను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన 11 మంది సభ్యుల్లో తుషారకు స్థానం దక్కని విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో భుజం గాయానికి చికిత్స నిమిత్తం స్వదేశానికి వెళుతున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని జట్టు ఫిజియో అన్నాడు.