వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మా ఆటగాళ్లకు అనుమతి ఇవ్వలేదు: వసీం బారీ (NOC | IPL-3 | PCB | Wasim Bari | Abdul Razzak | Karachi)
Feedback Print Bookmark and Share
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్-3లో ఆడేందుకు తమ జట్టు ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొట్టిపారేసింది. ఐపీఎల్-3లో పాల్గొనేందుకు ఆటగాళ్లలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వసీం బారీ స్పష్టం చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో తమ ఆటగాళ్లను ఆడించే విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. అనేకంగా ఈ సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అవుతుందని చెప్పారు.

ఇదిలావుండగా, పాక్ జట్టు ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మంగళవారం మాట్లాడుతూ ఐపీఎల్-3లో పాల్గొనేందుకు తమ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇచ్చినట్టు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా, తాను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడేందుకు త్వరలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్టు కూడా ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.