వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భారత్‌లో టెస్టు క్రికెట్ ప్రేమికులు ఏడు శాతమే: సర్వే (Indians | Prefer | Test cricket | Survey | South Africa | New Zealand | ODI)
Feedback Print Bookmark and Share
 
నానాటికీ ఆదరణ తగ్గిపోతున్న టెస్టు క్రికెట్‌ను కాపాడలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు పిలుపునిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఐదు రోజుల ఫార్మెట్ పట్ల ఆసక్తి చూపే క్రికెట్ అభిమానులు కేవలం ఏడు శాతంగానే ఉంది. సచిన్ వంటి ఆటగాడు కలిగిన భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఇలాంటి ఓటింగ్ రావడం ఆశ్చర్యకరంగా ఉంది. మేరీలీబోన్ క్రికెట్ క్లబ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 500 మంది క్రికెట్ అభిమానుల వద్ద ఈ సర్వే నిర్వహించారు. భారత్ తరపున పాల్గొన్న వారిలో 58 శాతం మంది అభిమానులు పొట్టి ఫార్మెట్ ట్వంటీ-20 పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యాభై ఓవర్ల వన్డేల పట్ల 31 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ట్వంటీ-20 క్రికెట్‌ను 58 శాతం మంది ఇష్టపడటం గమనార్హం.

ఇకపోతే.. టెస్టుల పట్ల ఏడు శాతం ప్రజలు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పట్ల నాలుగు శాతం అభిమానులు ఆసక్తి చూపుతున్నట్టు ది ఏజ్ పత్రిక వెల్లడించింది. ఈ మూడు దేశాలకు చెందిన అభిమానుల్లో 13 శాతం మంది టెస్టు క్రికెట్‌‌కు అనుకూలంగా ఓటు వేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.