ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అహ్మదాబాద్ టెస్టు: సెంచరీతో కదం తొక్కిన జయవర్ధనే (Sri Lanka | India | Century | Jayawardhane | Test | Amhedabad)
అహ్మదాబాద్ టెస్టులో పర్యాటక శ్రీలంక జట్టు ధీటుగానే సమాధానమిస్తోంది. ఆ జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజున ఓపెనర్ దిల్షాన్ 112 పరుగులు చేయగా, మూడో రోజున మాజీ కెప్టెన్ జయవర్ధనే 113 పరుగులతో ఇంకా ఆడుతున్నారు. ఫలితంగా శ్రీలంక జట్టు భారత్ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరును అధికమించింది.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 426 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభం నుంచి ఆకట్టుకుంది. ఓపెనర్లు దిల్షాన్ (112), పరణవితన (35)లు తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఆ తర్వాత సంగక్కర (31), జయవర్ధనే (113*), సమరవీర (70), కీపర్ జయవర్ధనే (32*)లు రాణించారు.
దీంతో శ్రీలంక జట్టు మూడో రోజు మధ్యాహ్నానికి ఐదు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు రెండేసి వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశాడు.