ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్-కివీస్ టెస్టు సిరీస్‌లో రివ్యూ విధానం అమలు!
(Review system | implemented | Pak-NZ Test series | ICC | PCB | Cricket)
న్యూజిలాండ్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య త్వరలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌లో అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (యూడీఆర్ఎస్)ను అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది.
డునెడిన్ కేంద్రంగా పని చేసే అనిమేషన్ రీసెర్చ్ లిమిటెడ్ సంస్థతో ఒప్పంద కుదరడంతో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విధానం అమలుకు అవసరమైన విర్చువల్ ఐ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ సమకూర్చనుంది.
ఈ యేడాది అక్టోబరు నుంచి రివ్యూ విధానాన్ని అమలు చేస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి గత జూన్ నెలలో ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, దీనికయ్యే ఖర్చును మాత్రం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే క్రికెట్ బోర్డులు మాత్రమే భరించాలని ఐసీసీ మెలిక పెట్టింది.
ఈ నిర్ణయం పట్ల పలు క్రికెట్ బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అందువల్లే ప్రస్తుతం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా ఈ విధానాన్ని అమలు చేయలేదు. అలాగే, త్వరలో జరుగనున్న దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్, వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లలో కూడా ఈ విధానం అమలు చేయక పోవడం గమనార్హం.