ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సచిన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు: మనోహర్ (Sachin Tendulkar| BCCI| Shashank Manohar| World cup 2011| Cricket| News)
అంతర్జాతీయ క్రికెట్లో 20 సంవత్సరాల పాటు రాణించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ప్రశంసించారు.
మాస్టర్ ప్రవర్తన, ఆటపట్ల మక్కువ వంటి అంశాలే సచిన్‌ను 20 ఏళ్లపాటు క్రికెట్ కెరీర్‌లో కొనసాగింపజేశాయని మనోహర్ అన్నారు. అయితే సచిన్ ఇరవై ఏళ్ల కెరీర్‌లో వరల్డ్‌కప్ విజయం లేకపోవడం పెద్దలోటు అని, ఇప్పటికి ఐదు ప్రపంచ కప్‌లలో పాల్గొనప్పటికి మెగా ట్రోఫీని అందించలేకపోయాడని మనోహర్ గుర్తు చేశాడు.
ప్రస్తుతం అతడి ఆటతీరును చూస్తే వచ్చే వరల్డ్‌కప్ (2011)లో ఆడటం దాదాపు ఖాయమేనని, ప్రపంచకప్‌లో ఆడటమే గాకుండా సచిన్ కప్ కూడా సాధించిపెడతాడని మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.