వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » వర్సెస్టర్‌షైర్ తరపున ఆడనున్న బంగ్లా క్రికెటర్! (England| Bangladesh| All Rounder Rankings| Shakib| ICC| Kapil Dev| Cricket| News)
Feedback Print Bookmark and Share
 
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడే అవకాశం లభించింది. దీంతో తొలి ఇంగ్లండ్ కౌంటీల్లో ప్రవేశించే తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా షకీబ్ స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షకీబ్ వచ్చే ఏడాది జూలైలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టూర్ పూర్తయిన తర్వాత ఈ కబ్ల్‌లో చేరనున్నాడు.

ఈ సందర్భంగా వర్సెస్టర్‌షైర్ క్రికెట్ డైరక్టర్ స్టీవ్ రోడ్స్ మాట్లాడుతూ, కొంతకాలంగా తాను షకీబ్ ఆటతీరును గమనిస్తున్నామని చెప్పారు. అతని ఆల్‌రౌండర్ నైపుణ్యాలు తమ యువజట్టుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా షకీబ్ స్పందిస్తూ.. దిగ్గజ ఆల్‌రౌండర్లు కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఆడిన చరిత్ర గల కౌంటీలో చేరడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ తరపున గట్టిపోటీని ప్రదర్శించేందుకు కృషి చేస్తానని షకీబ్ అన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.