వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టిన జయవర్ధనే ద్వయం! (World record | Jayawardhane | Wicket | India | Sri Lanka | First test)
Feedback Print Bookmark and Share
 
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ఆటగాళ్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఆతిథ్య జట్టుతో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ జయవర్ధనే, జట్టు వికెట్ కీపర్ జయవర్ధనేలు 72 సంవత్సరాల నాటి ప్రపంచ రికార్డును తిరగరాశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు ఏకంగా 351 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా.. ప్రపంచ రికార్డు చెరిగి పోయి.. సరికొత్త రికార్డును తమపేరుపై లిఖించుకున్నారు.

1937 సంవత్సరంలో ఇంగ్లండ్‌తో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులోఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మెన్, జాక్ ఫింగిల్‌టన్‌ల పేరుమీద ఈ రికార్డు ఉంది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 346 పరుగులు జోడించారు. ఈ రికార్డును మహేల జయవర్ధనే, ప్రసన్న జయవర్ధనేలు తిరిగరాశారు.

అంతేకాకుండా, భారత గడ్డపై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక రికార్డు పుటలకెక్కింది. ఇప్పటి వరకు 1986లో కాన్పూర్‌లో భారత్ చేసిన 676/7 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక జట్టు 760/7 పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.