పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ అన్నారు. అక్తర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించడం గగనమేనని ఆయన చెప్పుకొచ్చారు.
34 సంవత్సరాల అక్తర్‌కు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఫిట్‌నెస్ తీవ్ర ప్రతిబంధకంగా మారుతోందన్నారు. అందువల్ల జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడం ఇక కష్టమేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లిపోసక్షన్ సర్జరీ (కొవ్వును తగ్గించే శస్త్రచికిత్స) చేయించుకోవాలని భావిస్తున్నాడు.
ఈ ఆపరేషన్ తర్వాత అక్తర్ తిరిగి కోలుకోవాలంటే కనీసం మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడగలుగుతాడని ఆయన అన్నారు. పాక్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ పాస్ట్ బౌలర్ కెరీర్ ఆది నుంచి వివాదాస్పందానే సాగుతున్న విషయం తెల్సిందే.