వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అంతర్జాతీయ క్రికెట్ 'పరుగు' ప్రపంచంలో "ఒకే ఒక్కడు" (Sachin | 30k | Runs | First Test | Ahmedabad | Cricekt)
Feedback Print Bookmark and Share
 
భారత పరుగుల యంత్రం 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ మరో అరుదైన రికార్డును చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో టెస్టులు, వన్డే ఫార్మెట్‌లలో కలిపి 30 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇలాంటి ఆటగాడుగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.

ఇటీవలే వన్డేల్లో 17 వేల పరుగులును పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పిన సచిన్.. ఆ రికార్డు నుంచి తేరుకోక ముందే శుక్రవారం మరో రికార్డు నెలకొల్పడం గమనార్హం. అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజున సచిన్.. ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తం 17,178 పరుగులు చేసిన సచిన్.. టెస్టుల్లో 12,822 పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా ఈ రెండు ఫార్మెట్‌లలో కలిపి 30 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా, తన కెరీర్‌లో 59 సార్లు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును సొంతం చేసుకోగా, "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్" అవార్డును 14 సార్లు కైవసం చేసుకున్నాడు. ఇకపోతే.. 1998 సంవత్సరంలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 1894 పరుగులు చేసిన క్రికెటర్‌ రికార్డు కూడా సచిన్ పేరుమీదే ఉంది. అంతేకాకుండా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో ఏడు సార్లు, వన్డేల్లో ఐదు సార్లు చొప్పున వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఘనతను కూడా దక్కించుకున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.