వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » రేపటి నుంచి కాన్పూర్ టెస్టు మ్యాచ్ టిక్కెట్ల విక్రయం (Sale | tickets | Kanpur | Test match | India | Sri Lanka | Tickets | Cricket)
Feedback Print Bookmark and Share
 
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న రెండో టెస్టుకు కాన్పూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టెస్టు మ్యాచ్ టిక్కెట్లను శనివారం నుంచి విక్రయించనున్నారు. కాన్పూర్‌లోని ఎనిమిది భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచీలలో టిక్కెట్లను విక్రయించనున్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పీడీ.పాఠక్ మాట్లాడుతూ.. పెవిలియన్ టిక్కెట్ ధరను రూ.2500గా నిర్ణయించినట్టు చెప్పారు. ఐదు రోజుల పాటు మ్యాచ్‌ను వీక్షించే విధంగా ఈ ధరను ఖరారు చేసినట్టు తెలిపారు.

అలాగే, ఒకరోజు టిక్కెట్ ధరను రూ.600గా ఖరారు చేసినట్టు చెప్పారు. గ్యాలరీ టిక్కెట్ ధర ఐదు రోజలకు గాను రూ.100గా నిర్ణయించామన్నారు. ఒక్కరోజు టిక్కెట్ ధరగా రూ.30 వసూలు చేస్తామన్నారు. ఇకపోతే.. స్టూడెంట్ గ్యాలరీ టికెట్‌ ధరను రూ.50 (పూర్తి మ్యాచ్‌), ఒక రోజు టిక్కెట్ ధరను రూ.20గా నిర్ణయించినట్టు తెలిపారు.

నగరంలోని వివిద అనాథ ఆశ్రమాలకు చెందిన వంద మంది చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు చెప్పారు. వీరి రవాణా సౌకర్యాలతో పాటు.. ఆహార పానీయాలను కూడా క్రికెట్ అసోసియేషన్ భరిస్తుందని పాఠక్ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.