వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » గంభీర్ - సచిన్ సెంచరీలు: తొలి టెస్టు మ్యాచ్ డ్రా (Ahmedabad Test | Draw | Sachin | Dravid | Gambhir | Sehwag | Dilshan)
Feedback Print Bookmark and Share
 
పరుగుల వరద పారిన అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ ఆద్యంతం శ్రీలంక జట్టు ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. భారత తొలి ఇన్నింగ్‌లో రాహుల్ ద్రావిడ్ అండగా నిలువగా, రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గంభీర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లు సెంచరీలు చేశారు. ఫలితంగా శ్రీలంకను ఊరించిన విజయం.. ఊసురుమంటూ డ్రాగా ముగిసింది.

అంతకుముందు శ్రీలంక జట్టు 760 పరుగులు భారీ స్కోరును చేసిన విషయం తెల్సిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ ‌పై 334 పరుగులు భారీ ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజున రెండు వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసింది. ఐదోరోజైన శుక్రవారం గంభీర్ (114), అమిత్ మిశ్రా (24), టెండూల్కర్ (100 నాటౌట్), లక్ష్మణ్ (51)లు రాణించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది.

అయితే, చివరి రోజున అమిత్ మిశ్రా వికెట్‌ త్వరగా తీసినప్పటికీ.. గంభీర్ సెంచరీతో ఆదుకున్నాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్ భాగస్వామ్యం శ్రీలంక జట్టు విజయంపై ఆశలు వదులుకునేలా చేసింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. అయితే, ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని భావించడంతో ఫలితం తేలకుండానే ముగిసింది.

తొలి టెస్టు సంక్షిప్త స్కోరు వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్.. 426 (రాహల్ ద్రావిడ్ 177, ధోనీ 110, యువరాజ్ సింగ్ 68)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్.. 760/7 డిక్లేర్. (దిల్షాన్ 112, జయవర్ధనే 275, ప్రసన్న జయవర్ధనే 154*, సమరవీర 70).
భారత్ రెండో ఇన్నింగ్స్.. 412/4 (గంభీర్ 114, సచిన్ 100* లక్ష్మణ్ 51*, సెహ్వాగ్ 51).
సంబంధిత సమాచారం కోసం శోధించండి.