వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » తొలి టెస్టులో ఓడిపోతామని భయపడలేదు: ధోనీ (First Test | Dhoni | Ahmedabad | India | SL | Openers | Wickets | Batting pitch)
Feedback Print Bookmark and Share
 
అహ్మదాబాద్‌లో పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఓడిపోతామనే భయం తమను ఆవరించలేదని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. తమను ఓడించాలంటే శ్రీలంక ఎనిమిది వికెట్లను తీయాల్సి ఉండగా, తమ ఓపెనర్లు ఆరంభంలోనే మంచి భాగస్వామ్యం లభించిందన్నాడు.

ఆరంభంలోనే వికెట్లు పోగొట్టుకోకుండా ఆడితే శ్రీలంక బౌలర్లు చమటోడ్చక తప్పదని భావించామన్నారు. దానికి అనుగుణంగానే పక్కా గేమ్ ప్లాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆడినట్టు చెప్పారు.

ఇకపోతే.. ఈ పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించేదిగా లేదన్నారు. పిచ్‌లో అసలు బౌన్స్‌ అనే మాట ఎక్కడా కనిపించలేదన్నారు. మూడోరోజు తర్వాత కొంత జీవం ఉంటుందని అనుకున్నానని... అయితే అది కూడా లేదని ధోనీ పేర్కొన్నాడు. పాస్ట్ బౌలర్లతో పాటు... స్పిన్నర్లకు కూడా ఏమాత్రం సహకరించలేదని ధోనీ అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.