ప్రపంచ దేశాల అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ త్వరలోనే ప్రపంచ ఈవెంట్‌గా ఆవిర్భవించే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో ప్రపంచ దేశాలన్నీ ఆడే రోజు త్వరలో వస్తుందని చాపెల్ జోస్యం చెప్పారు.
న్యూయార్క్‌తో ముంబై.. ముంబైతో బీజింగ్.. బీజింగ్‌తో సిడ్నీ.. సిడ్నీతో లండన్ ఇలాంటి మ్యాచ్‌లు త్వరలోనే జరుగుతాయేమోనని చాపెల్ అభిప్రాయపడ్డారు. టీ20ల ఆదరణ టెస్టులపై ప్రభావం చూపుతుందని చాపెల్ అన్నారు. ఐపీఎల్‌లో ఆడని చాలా దేశాలు కూడా రానున్న రోజుల్లో ఐపీఎల్ కోసం తమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చాపెల్ తెలిపారు.