వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » రెండో టెస్టుకు శ్రీలంక పేస్ బౌలర్ దమ్మిక దూరం! (Kanpure | Second test | India | Bowler | Sachin | Sangakkara | Dammika)
Feedback Print Bookmark and Share
 
అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ మహేళ జయవర్ధనే, ప్రసన్న జయవర్ధనేలు ప్రపంచ రికార్డును నెలకొల్పారు. భారత పరుగుల యంత్రం సచిన్ టెండూల్కర్ మరో మైలురాయిని చేరుకున్నారు. వన్డేలు, టెస్టుల్లో కలిపి 30 వేల పైచిలుకు పరుగులు సాధించారు. మొత్తం మీద తొలి టెస్టు రికార్డులతో ముగిసిపోయింది.

ఇకపోతే.. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు కాన్పూర్‌లో జరుగనుంది. ఈ టెస్టుకు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కండరాల నొప్పితో బాధపడుతున్న ప్రసాద్.. తొలి టెస్టు ఐదో రోజున కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దమ్మిక రెండో టెస్టులో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని లంక సారథి సంగక్కర చెప్పాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.