వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ తొలి వన్డే వర్షార్పణం! (First | South Africa | England | one-day | international | rained off)
Feedback Print Bookmark and Share
 
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ జరిగే సెంచూరియన్ పార్కులో రెండు రోజులుగా భారీ వర్షం పడింది. ముఖ్యంగా, గురువారం 20 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు కావడంతో స్టేడియం తడిసి ముద్దయింది. ఫలితంగా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

కనీసం 20 ఓవర్ల పాటు కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు వీలుకాలేదు. దీంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం సెంచూరియన్‌లో జరుగనుంది. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభమవుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.