వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అక్తర్ రీఎంట్రీపై వచ్చిన వార్తలను తోసిపుచ్చిన భట్ (Ejaz Butt | denies | ruling out | Akhtar | comeback | PCB)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని తాను వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తల్లో అణు మాత్రం నిజం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద క్రికెటర్ తరచూ గాయాల బారిన పడుతున్నారని, అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వుంటుందన్నారు.

అలాగే, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తే తప్పకుండా జాతీయ జట్టులో చోటు కల్పించేందుకు అక్తర్ పేరును పరిశీలిస్తామని మాత్రమే చెప్పినట్టు శనివారం వివరణ ఇచ్చారు. కొవ్వు తగ్గించే శస్త్ర చికిత్స చేయించుకున్న అక్తర్‌కు.. ఫిట్‌నెస్ కూడా ప్రధాన సమస్యగా ఉన్న విషయం తెల్సిందే.

దీంతో అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని భట్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించారు. ఎలాంటి శ్రేణి క్రికెటర్ అయినా తమ సామర్థ్యాన్ని, సత్తాతో పాటు.. ఫిట్‌నెస్‌ను దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకోవాల్సి వుందన్నారు. వీటిని నిరూపించుకుంటే జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవచ్చన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.