ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మెతేరా వంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు నష్టం: భజ్జీ (Motera | tracks | would kill | Test cricket | Harbhajan | Ahmedabad)
మెతేరా వంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు నష్టం: భజ్జీ
శనివారం, 21 నవంబర్ 2009( 19:19 IST )
భారత్-శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన మోతేరా క్రికెట్ స్టేడియం పిచ్ టెస్టు క్రికెట్‌కు చంపేస్తుందని భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు బ్యాట్స్‌మెన్స్‌కు ఉచిత టిక్కెట్ల వంటివన్నారు.
డ్రాగా ముగిసిన తొలి టెస్టుపై భజ్జీ శనివారం స్పందిస్తూ.. ఫలితం తేలని పిచ్‌ల టెస్టు క్రికెట్‌కు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే ప్రేక్షకాధారణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారన్నారు. కానీ, మోతేరా వంటి పిచ్‌ల వల్ల ఈ లక్ష్యం నెరవేరదని భజ్జీ అభిప్రాయపడ్డారు.