ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » జాక్వెస్ కల్లీస్‌కు గాయం: వన్డే సిరీస్‌కు దూరం! (Kallis | ruled out | South Arica | one-day | series | Rib Injury)
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లీస్ గాయపడ్డాడు. ఫలితంగా స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగే ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
కల్లీస్‌కు పక్కటెముకకు గాయమైంది. దీనివల్ల డిసెంబరు 16వ తేదీ నుంచి సెంచూరియన్ పార్కులో ఇంగ్లండ్, ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం అనుమానమేనని సీఎస్ పేర్కొంది.
భారత్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సందర్భంగా ఈ గాయం బయటపడిందని, వెంటనే దీనికి స్కాన్ తీయగా అందులో ఏమీ కనిపించలేదన్నారు. అయితే, స్వదేశంలో మళ్లీ స్కాన్ తీయగా, అందువల్లే పక్కటెముకకు గాయమైనట్టు తేలిందని జట్టు కోచ్ మికీ ఆర్థూర్ తెలిపారు.
ఈ గాయం ప్రభావం వల్ల వచ్చే నాలుగు వారాల పాటు కెల్లీస్ క్రికెట్ కెరీర్‌కు ఆటంకం కలుగుతుందని చెప్పారు. మొదటి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గాయం తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.
కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే భారీ వర్షం కారణంగా రద్దు అయింది. ఆదివారం రెండో వన్డే జరుగనుంది.