ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » దిల్షాన్‌కు ముక్కు పగిలింది: రెండో టెస్టుకు సిద్ధం! (Dilshan | fractures | nose | play | Kanpur Test | Foot ball | Match)
దిల్షాన్‌కు ముక్కు పగిలింది: రెండో టెస్టుకు సిద్ధం!
ఆదివారం, 22 నవంబర్ 2009( 11:12 IST )
జట్టు సభ్యులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతుండగా శ్రీలంక క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ దిల్షాన్‌కు ముక్కుకు గాయమైంది. అయినప్పటికీ.. మంగళవారం నుంచి కాన్పూర్‌లో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆ జట్టు మేనేజర్ తెలిపాడు.
అహ్మదాబాద్‌లో శుక్రవారం తొలి టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత.. లంక జట్టు మైదానంలో ఫుట్‌బాల్ ఆడింది. ఆ సమయంలో మరో సభ్యుడిని దిల్షాన్ ఢీకొట్టాడు. దీంతో అతని ముక్కు పగిలిపోగా, వెంటనే ఆస్పత్రికి తరలించి ఎక్స్-రే తీసి పరీక్షించారు. దీనిపై లంక జట్టు మేనేజరు బ్రెండన్ కురుప్పు మాట్లాడుతూ.. ఈ గాయం పెద్ద ప్రమాదమేమీ కాదని, అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
గాయానికి చికిత్స చేయించుకున్న తర్వాత కాన్పూర్‌కు బయలుదేరి వెళ్లినట్టు తెలిపారు. ఈ గాయం వల్ల దిల్షాన్ ఎలాంటి అసౌకర్యానికి గురికావడం లేదని, జట్టు సభ్యులతో కలిసి రేపటి నుంచి ప్రాక్టీస్‌లో పాల్గొంటాడని చెప్పారు.