ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » బ్రెట్ లీ టెస్టులకు స్వస్తి చెప్పాలి: రోడ్నీ హాగ్ (Brett Lee | quit | Test | concentrate | ODIs | T20s | Pacer | Rodney Hogg)
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ టెస్టులకు స్వస్తి చెప్పి, వన్డేలు, ట్వంటీ-20 మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరించాలని ఆ దేశ మాజీ పేసర్ రోడ్నీ హాగ్ అభిప్రాయపడ్డారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇంతకంటే మరో మార్గం బ్రెట్ లీకి లేదన్నాడు. 2011 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హాగ్ అన్నాడు.
ఇటీవలి కాలంలో బ్రెట్ లీ ఎక్కువగా గాయాలబారిన పడుతున్న విషయం తెల్సిందే. తాజాగా భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయాడు. బ్రెట్ లీ లేని లోటు ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో.. టెస్టు క్రికెట్ నుంచి బ్రెట్ లీ స్వస్తి చెప్పాలని సూచించాడు. అదేసమయంలో వన్డే, ట్వంటీ-20 కెరీర్‌పై మనస్సును లగ్నం చేయాలని కోరారు. సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌ను కొనసాగించాలంటే ఇదే ఏకైక మార్గమన్నారు.