ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆస్ట్రేలియాకు చేరుకోనున్న విండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ (Gayle | fly | back | Australia | hopes | play | first Test | West Indies)
ఆస్ట్రేలియాకు చేరుకోనున్న విండీస్ కెప్టెన్ క్రిస్ గేల్
ఆదివారం, 22 నవంబర్ 2009( 17:01 IST )
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ క్రిస్ గేల్ ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నారు. తన తల్లి అనారోగ్యం వల్ల ఆస్పత్రి పాలుకావడంతో ఆమెను చూసేందుకు జట్టు మేనేజ్‌మెంట్ అనుమతితో విండీస్‌కు బయలుదేరిన విషయం తెల్సిందే. అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి ఆసీస్ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని జమైకా మీడియా వెల్లడించింది.
ఆస్ట్రేలియాకు ఆదివారం బయలుదేరి వెళ్లాలని గేల్ భావిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు బ్రిస్బేన్‌లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు గేల్ అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో నెలకొన్న సంక్షోభం సద్దుమణగడంతో గేల్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించిన విషయం తెల్సిందే. అయితే, జట్టు బాధ్యతలు చేపట్టిన తర్వాత విండీస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.