వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కాన్పూర్‌ పిచ్‌పై పరుగుల వరద: క్యూరేటర్ (Kanpure | Green Park pitch | Batting | Second Test | India | Sri Lanka)
Feedback Print Bookmark and Share
 
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న రెండో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ పిచ్‌ కూడా పరుగుల వరద పారించనుంది. ఈ పిచ్‌ను పరిశీలిస్తే.. దాదాపుగా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌గా భావిస్తున్నారు. అయితే, పిచ్ క్యూరేటర్ మాత్రం ఇది సంప్రదాయ పిచ్ అని చెపుతున్నారు.

ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. దీంతో కాన్పూర్ టెస్టుపై ఆసక్తి నెలకొంది. గ్రీన్ పార్కు పిచ్ బ్యాట్స్‌మన్‌‌కు స్వర్గధామంగా ఉంటుందని, ఐదు రోజుల పాటు ఆట కొనసాగుతుందని క్యూరేటర్లు అంటున్నారు.

ఈ వేదికపై గతయేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఈ టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడంతో, దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. జీంచో రెండో టెస్టుకు కొత్తగా తయారు చేసిన పిచ్‌ను ఉపయోగించాలని తొలుత భావించారు. అయితే.. బీసీసీఐ పిచ్‌ కమిటీ ఛైర్మన్‌ దల్జీత్‌ సింగ్‌ మాత్రం పాత పిచ్‌నే ఉపయోగించాలని సూచించారు.

దీనిపై స్టేడియం పిచ్ క్యూరేటర్ శివకుమార్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విధి విధానాల మేరకే పిచ్‌ను తయారు చేసినట్టు చెప్పారు. మొదటి రెండు రోజులు పిచ్‌ బ్యాట్స్‌మన్‌కు అనుకూలిస్తుందని, మిగతా మూడు రోజులు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.