వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కెప్టెన్ ధోనీ వేలికి గాయం.. కాన్పూర్‌కు కార్తీక్! (Dinesh Karthik | called | precautionary | measure | Kanpure | Dhoni | Injury)
Feedback Print Bookmark and Share
 
టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేతి వేలికి గాయమైంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కాన్పూర్‌కు హుటాహుటిన పిలిపించారు. కాగా, శ్రీలంక-భారత్ జట్ల మధ్య మంగళవారం నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్కు స్టేడియంలో రెండో టెస్టు జరుగనున్న విషయం తెల్సిందే.

అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా ధోనీ చేతి వేలికి గాయమైంది. దీంతో ప్రాక్టీస్‌లో కూడా పెద్దగా సాధన చేయలేదు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దినేష్ కార్తీక్‌ను కాన్పూర్‌కు పిలిపించారు.

హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగే రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ ఆడేందుకు గాను కార్తీక్ ధర్మశాలలో ఉన్నాడు. భారత జట్టులో చేరాల్సిందిగా ఆదివారం మధ్యాహ్నం కార్తీక్‌కు కబురు పంపాం. దీంతో అతను హుటాహుటిన ధర్మశాల నుంచి బయలుదేరి కాన్పూర్‌కు చేరుకున్నట్టు బీసీసీఐ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ షెట్టి తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యగానే కార్తీక్‌కు పిలుపు పంపినట్టు తెలిపారు. అయితే, ధోనీకి తగిలిన గాయం వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, రెండో మ్యాచ్‌కు యధావిధిగా బరిలోకి దిగుతాడని జట్టు యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.