ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఇండో-పాక్ టెస్టు సిరిస్ ఆతిథ్యానికి ఇంగ్లండ్ ఆసక్తి! (ECB | eager | to host | India-Pak | Test series | England)
వచ్చే సంవత్సరం తమ గడ్డపై భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య టెస్టు సిరీస్ నిర్వహించేందుకు ఇంగ్లండ్ అమితాసక్తిని చూపుతోంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సమ్మతిస్తే ఈ చిరస్మరణీయమైన టెస్టు సిరీస్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రెసిడెంట్ గైల్స్ క్లార్క్ తెలిపారు.
తమ దేశంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు ఎక్కువ సంఖ్యలోనే నివశిస్తున్నారన్నారు. అందువల్ల తమ దేశంలో ఇండో-పాక్ టెస్టు సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదించడం మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. పాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించేందుకు నిరాకరిస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము పాక్‌కు సాయపడాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, వచ్చే యేడాది వేసవి కాలలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా దేశాల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే యేడాది జులై నెలలో పాక్-ఆసీస్ జట్లు రెండు టెస్టులు, రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లను ఆడనున్నాయి.