వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్‌ కోచ్‌ ఆలమ్‌, కమ్రాన్‌ అక్మల్‌లపై వేటు! (Pakistan | Alam | Kamran Akmal | England | Twenty-20 | Shoaib Malik)
Bookmark and Share Feedback Print
 
FILE
ఇంగ్లాండ్‌తో జరిగే పరమిత ఓవర్ల ట్వంటీ-20 సిరీస్‌లో పాల్గొనే పాకిస్థాన్‌ జట్టులో పాకిస్థాన్ కోచ్ ఆలమ్, కమ్రాన్ అక్మల్‌లకు కోచు దక్కలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర వైఫల్యం కారణంగా జట్టుకు భారంగా మారిన వీరిద్దరిపై పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. దుబాయిలో ఈ నెల 19, 20 తేదీల్లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్‌ రెండు టి-20 మ్యాచుల్లో తలపడుతోంది.

బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణల్లో చిక్కుకొని రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన పాక్‌ టి-20 కెప్టెన్‌ అఫ్రిది స్థానంలో జట్టుకు షోయబ్‌ మాలిక్‌ కెప్టెన్సీ సారథ్యం వహిస్తాడు. భట్‌, ఆసిఫ్‌, ఇఫ్తికార్‌లపై వేటు పడగా, ఆల్‌రౌండర్‌లు యాసిర్‌ అరాఫత్‌, అబ్దుల్‌ రజాక్‌లకు జట్టులో చోటు కల్పించినట్లు పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాసిమ్‌ బారి చెప్పినట్లు “ది డాన్‌’ పత్రిక తెలియజేసింది. అయితే, ఏప్రిల్‌, మే నెలల్లో వెస్టిండీస్‌లో జరిగే ట్వంటీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాక్‌ జట్టుకు అఫ్రీదీ సారథ్యం వహిస్తాడని బారి చెప్పారు.

దుబాయిలో ఈ నెల ద్వితీయార్ధంలో ఇంగ్లండ్‌తో ఆడే రెండు ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు సోమవారం 14 మంది సభ్యులతో ఎంపిక చేసిన పాకిస్థాన్‌ జట్టును పీసీబీ ప్రకటించింది. చేతి గాయం నుంచి కోలుకున్న వెటరన్‌ ఆల్‌రౌండర్‌ అబ్దుర్‌ రజాక్‌ను, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ యాసిర్‌ అరాఫత్‌ను జట్టులోకి తిరిగి తీసుకున్నారు.

కాగా, ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ వరుసగా ఓడిపోవడం వల్ల చీఫ్‌ సెలక్టర్‌ ఇక్బాల్‌ ఖాసిమ్‌ కూడా తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దీనితో పిసిబి చైర్మన్‌ ఇజాజ్‌ బట్‌ ఇతర సెలక్టర్లను సంప్రదించి టి20 జట్టును ఖరారు చేయవలసి వచ్చింది. దీంతో మాజీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఇజాజ్‌ అహ్మద్‌ను ట్వంటీ20 జట్టుకు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించారు.

పాక్‌ జట్టు సభ్యుల పేర్లు: షోయబ్‌ మాలిక్‌ (కెప్టెన్‌), ఇమ్రాన్‌ నజీర్‌, ఇమ్రాన్‌ ఫర్హత్‌, ఖాలిద్‌ లతీఫ్‌, ఉమర్‌ అక్మల్‌, ఫవద్‌ ఆలమ్‌, షహీద్‌ అఫ్రీదీ, సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఉమర్‌ గుల్‌, సయీద్‌ అజ్మల్‌, వాహబ్‌ రియాజ్‌, మహమ్మద్‌ తల్హా, అబ్దుర్‌ రజాక్‌, యాసిర్‌ అరాఫత్‌.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.