వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సచిన్‌, ధోనీల అవుట్: భారత స్కోరు 223/6 (Sachin Tendulkar | Century | Mahendra Singh Dhoni | out | South africa | India)
Bookmark and Share Feedback Print
 
FILE
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో భారత క్రికెటర్లు ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించి వెంటనే అవుటైన వీరేంద్ర సెహ్వాగ్ బాటలో సచిన్ పయనించాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆటలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హ్యాట్రిక్ సెంచరీ సాధించినప్పటికీ, వెంటనే పెవిలియన్ ముఖం పట్టాడు.

అలాగే టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కేవలం 25 పరుగులకే ఇంటి దారి పట్టాడు. ఫలితంగా నాగ్‌పూర్ తొలి టెస్టులో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 223 స్వల్ప పరుగులను మాత్రమే సాధించింది.

దక్షిణాఫ్రికా బౌలర్ల ఆటతీరును ధీటుగా ఎదుర్కొంటూ.. భారత్ కోసం పోరాడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 179 బంతుల్లో 13 బౌండరీల సహాయంతో శతకం కొట్టాడు. దీంతో తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో సచిన్ 46వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కానీ శతకం సాధించిన సచిన్ టెండూల్కర్‌ హారిస్‌కు తన వికెట్ సమర్పించుకుని దురదృష్టకరంగా పెవిలియన్ దారి పట్టాడు.

భారత్ కోసం పోరాడుతూ.. దక్షిణాఫ్రికా రివర్స్ స్వింగ్ బౌలింగ్‌, డేల్ స్టెయిన్ అద్భుత బౌలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని మెల్ల మెల్లగా ఒక్కో పరుగును సాధించిన సచిన్ టెస్టు క్రికెట్లో 46వ సెంచరీని నమోదు చేసుకోవడంతో పాటు.. వరుసగా మూడో శతకం, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులో తొలి శతకాన్ని సచిన్ సాధించి కొత్త రికార్డును సృష్టించాడు.

ఇకపోతే.. టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఏమాత్రం రాణించలేదు. పేలవమైన ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచిన మహేంద్ర సింగ్ ధోనీ (112 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు) 25 పరుగుల వద్ద హారిస్ బౌలింగ్‌లో విల్లియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. ప్రస్తుతం సాహా (4), హర్భజన్ సింగ్ (11)లు క్రీజులో ఉన్నారు. దీంతో 79 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల పతనానికి 223 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హారిస్ మూడు వికెట్లు పడగొట్టగా, స్టెయిన్, మోర్కెల్, పార్నెల్ తలో వికెట్ సాధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.