ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » రెండో టెస్టులో సఫారీలను చిత్తు చేస్తాం : ధోనీ (Mahendra Singh Dhoni | South Africa | Kolkata Test | Nagpur Test)
కోల్‌కతాలో జరుగనున్న రెండో టెస్టులో సఫారీలను చిత్తుగా ఓడిస్తామని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. రెండో టెస్టును గెల్చుకొని సిరీస్ సమం చేయడమే తమ లక్ష్యమని ధోనీ పేర్కొన్నాడు. ఈనెల 14 నుంచి కోల్‌కతాలో ప్రారంభమయ్యే రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఎదురుదాడికి దిగుతామని ధోనీ అన్నాడు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో గ్రేమ్ స్మిత్ సేన అద్భుతంగా ఆడిందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కితాబిచ్చాడు. సఫారీల జట్టులో ప్రత్యేకించి పేసర్ డేల్ స్టెయిన్ తమను ప్రారంభంలోనే దెబ్బతీశాడని ధోనీ వ్యాఖ్యానించాడు.
నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత మీడియాతో ధోనీ మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ దక్షిణాఫ్రికా చక్కటి ఆటతో రాణించిందని ప్రశంసించాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడానికి హషీం ఆమ్లా, జాక్వెస్ కాలిస్ ప్రతిభే ప్రధాన కారణమని అన్నాడు. దీనికి బౌలర్లను తప్పుపట్టడం తగదని పేర్కొన్నాడు. బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలించని వికెట్‌పై భారత బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్ చేశారని అన్నాడు.