ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » శ్రీలంక క్రికెటర్లపై దాడి: నేడే "క్రికెట్ డార్కెస్ట్ డే"! (Cricket's darkest day | Pakistan | Sri Lanka | Terrorists attack | Munich Olympics | Israeli athletes)
శ్రీలంక క్రికెటర్లపై దాడి: నేడే "క్రికెట్ డార్కెస్ట్ డే"!
FILE
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడిని ప్రపంచ దేశాలకు చెందిన ప్రజలు ఎన్నటికీ మరిచిపోని "క్రికెట్'s డార్కెస్ట్ డే" నేడే..!. పలు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసే క్రికెట్ క్రీడపై ఉగ్రవాదుల కన్నేశారు. దీంతో ముసుగు ధరించిన తీవ్రవాదులు పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నేటితో ఏడాది పూర్తయ్యింది.
లాహోర్‌లోని గడఫి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టుకు ప్రయాణమైన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ కాల్పుల్లో శ్రీలంక క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర, అజంతా మెండీస్, తిలన్ సమరవీర, తరంగలు గాయాలకు గురైయ్యారు. అలాగే ఈ దాడుల్లో ఆరుగురు సైనికులతో పాటు ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.
ఇలాంటి దుర్ఘటన 1972వ సంవత్సరంలో మునిష్ ఒలింపిక్స్‌లో చోటు చేసుకుంది. ఇజ్రాయేల్ అథ్లెట్లను ఉద్దేశించి పాలస్తీనా ఉగ్రవాదులు పాకిస్థాన్ తరహా కాల్పులు జరిపారు. ఇందులో 11 మంది ఇజ్రాయేల్ అథ్లెట్లు మృతి చెందారు. కానీ క్రికెటర్లపై తీవ్రవాదులు దాడికి దిగడం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడుల్లో ఆటగాళ్లను సురక్షితంగా కాపాడి, తమ ప్రాణాలను అర్పించుకున్న సైనికులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.