వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కంగారూలతో తొలి వన్డే: న్యూజిలాండ్ విజయం! (Australia | Newzealand | First one Day | Nepier | LRPL Taylor)
Bookmark and Share Feedback Print
 
FILE
ఆస్ట్రేలియాతో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో దిగ్గజమైన కంగారూలపై గెలుపును నమోదు చేసుకున్న కివీస్ సంచలనం సృష్టించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు షేన్ వాట్సన్ (45), హెడ్డిన్ (12), కెప్టెన్ రికీ పాంటింగ్ (44), మైకేల్ క్లార్క్ (22), వైట్ (33), మైకేల్ హస్సీ (59), హోప్స్ (33), జాన్సన్ (21) జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించి పెట్టారు.

న్యూజిలాండ్ బౌలర్లలో టఫీ మూడు వికెట్లు, బాండ్ రెండు, ఫ్రాంక్లిన్, సౌథీలు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

కంగూరూలు నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు ఇన్‌‍గ్రామ్ (41), మెక్‌కల్లమ్ (45)లు బోలింగర్, జాన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగారు. తొలి వికెట్‌కు బరిలోకి దిగిన గుప్తిల్ కేవలం తొమ్మిది పరుగులకే పెవిలియన్ ముఖం పట్టాడు.

అయితే టాయిలర్ (70) అద్భుత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ ఐదో వికెట్‌కు 204 పరుగులు సాధించింది. చివరి 11 ఓవర్లలో లక్ష్య సాధనకు 72 పరుగులకే అవసరమైన తరుణంలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఒక దశలో కష్టాల్లో పడింది.

కానీ ఐదో వికెట్‌తో బరిలోకి దిగిన స్టైరిస్ 34 బంతుల్లో 49 పరుగులు సాధించి, కివీస్‌ను విజయపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. చివరికి షేన్ బాండ్ 11 పరుగులతో, స్టైరిస్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో న్యూజిలాండ్ 49.2 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 281 పరుగులతో లక్ష్యాన్ని చేధించి గెలుపును నమోదు చేసుకుంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో బోలింగర్ రెండు, హారిస్, జాన్సన్, హోప్స్, వాట్సన్, హరిడ్జ్‌లు తలా ఒక్కో వికెట్‌ను పడగొట్టారు. ఇకపోతే.. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ టాయిలర్‌కు మ్యాన్ ఆఫ్ ది అవార్డు దక్కింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.