వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » చిట్టాకాంగ్ తొలి టెస్టు: బంగ్లాపై ఇంగ్లాండ్ ఘనవిజయం (Bangladesh | England | Chittagong | GP Swann)
Bookmark and Share Feedback Print
 
FILE
చిట్టాకాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 513 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆడిన బంగ్లాదేశ్, తొలి టెస్టు ఐదో రోజైన మంగళవారం 331 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ 181 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.

191/5 డే/నైట్ స్కోరుతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లలో సిద్ధిక్ (68), ముఫ్తీకార్ రహీమ్ (47)లు ఆత్మవిశ్వాసంతో క్రీజులో రాణించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ 277 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ ఆరో వికెట్‌కు సుమారు 70 ఓవర్లలో 167 పరుగులు జోడించారు.

వీరిద్దరిలో సిద్ధిక్‌ను 106 పరుగుల వద్ద స్వాన్ అవుట్ చేయగా, ముఫ్తీకార్ రహీమ్‌ కూడా స్వాన్ (95) బౌలింగ్‌లోనే బోల్డ్‌గా వెనుదిరిగాడు. తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లల నయీమ్ ఇస్లామ్ (36) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇస్లామ్ తర్వాత హుస్సేన్ (12), అబ్ధుల్ రజాక్ (1)లు వెంట వెంటనే పెవిలియన్ ముఖం పట్టడంతో బంగ్లాదేశ్ 124 ఓవర్ల వద్ద 331 పరుగుల వద్ద కుప్పకూలింది.

మరోవైపు.. అద్భుత బౌలింగ్‌తో రాణించి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన స్వాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇకపోతే...బ్రెస్నాన్ మూడు వికెట్లు పడగొట్టగా, బ్రాడ్, ఫిన్ చెరో వికెట్ సాధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.